సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

504
Tapsi

తాప్సీ : ‘భవిష్యత్తులో వ్యాపారవేత్తగా స్థిరపడతాను’ అంటోంది కథానాయిక తాప్సీ. “నాకు మొదటి నుంచీ బిజినెస్ విమన్ అవ్వాలని వుండేది. అందుకే సినిమాల్లోకి వచ్చాక ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ సంస్థను స్థాపించాను. భారీ వివాహ వేడుకలకు మా సంస్థ ప్లానింగ్ ఇస్తుంది. అలాగే, బ్యాడ్మింటన్ లీగ్ లో ‘పూణే 7 ఏసెస్’ జట్టుకి సహ యజమానిగా వున్నాను. భవిష్యత్తులో మరిన్ని వ్యాపారాలు చేస్తాను” అని చెప్పింది.

రజనీకాంత్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 10 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్స్ వేస్తున్నారు.

మజిలీ: నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘మజిలీ’ చిత్రాన్ని వచ్చే నెల 5న విడుదల చేస్తున్నారు. ఈలోగా ఈ నెల 30న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు వెంకటేశ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తారు.

ఇస్మార్ట్ శంకర్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే గోవాలో పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ను వారణాసిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.