టాలీవుడ్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సాహసవీరుడు సాగరకన్య చిత్రం మనందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో శిల్పాశెట్టి సాగరకన్యగా అలరించింది. ఆ గెటప్ ఇప్పటికి ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ కూడా సాగరకన్య గెటప్‌లోకి మారి అందరిని అబ్బురపరచింది. మత్స్యకన్య గెటప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మడు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే సన్నీలియోన్ ఒక్కసారిగా సాగరకన్య అవతారంలోకి వచ్చే సరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫోటోలకి పలు కామెంట్స్ చేస్తున్నారు.
సన్నీ లియోన్ తమిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీరమాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తుంది. ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లోను ఈ అమ్మడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.