టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మథుడు 2.16 ఏళ్ల క్రితం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది మన్మథుడు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును కూడా అందుకుంది. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. హే మెనీనా..ఐ సీయూ వాన్న లవ్ అంటూ సాగే ఈ పాటలో నాగ్ మరోసారి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోండగా.. సమంత, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్లు తో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్స్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.