ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 23 జులై 2019

244
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేష రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబసభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీమిత్రులతోకానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటంలేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధవ్యవహారాలకు అనుకూలదినంకాదు.

వృషభ రాశి : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీస్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లోవిజయంసాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

మిథున రాశి : ఈ రోజువాయిదా పడుతున్న పనులు పూర్తిచేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి, ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులుకాని, ప్రశంసలు కాని పొందుతారు. మిత్రులు, బంధువుల సహాయం అందుకుంటారు.

కర్కాటక రాశి : ఈ రోజు రోజు వారి పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలోఅడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకికొత్తవస్తువులుకొనటంకానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహ రాశి : మానసికంగా ఆందోళనతోఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కన్య రాశి : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను,అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూలదినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణంచేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తంచేయటానికి అనువైనదినం. పిల్లల ఆరోగ్యవిషయంగా లేదా విద్యావిషయంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల రాశి : ఈ రోజువివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం.మీమాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థికలాభాలుంటాయి. జీవితభాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లుచేస్తారు. వాయిదా పనులు పూర్తవుతాయి.

వృశ్చిక రాశి : మీపిల్లలతోఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తిచేయగలుగుతారు. మీప్రేమను మీరుప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూలదినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్నఆందోళన మనసులోఉంటుంది. మీభావోద్వేగాలను అదుపులోఉంచుకోవటంమంచిది. పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి : ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళనకానీ, పరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువుపట్ల కొంతనిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మకర రాశి : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులోఉంచుకోవటంమంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యవ్యాపారం కలిసి వస్తుంది. మీరిచ్చేసలహాలు ఎదుటివారికి లాభిస్తాయి.

కుంభ రాశి : ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చు పైనపడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టేపోతుంది. పెట్టుబడులకు, వ్యాపారలావాదేవీలకు అనువైన రోజుకాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా డబ్బు ఖర్చయ్యే అవకాశ ముంది.

మీన రాశి : ఈ రోజు అనుకూలంగాఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్నపనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగాఅనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులసహాయ సహకారాలు అందుకుంటారు.