తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. RRR అంటే ‘రామరావణ రాజ్యం’ అని కొందరు, కాదు… RRR అంటే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అని ఎవ్వరికి నచ్చినట్టు వారు ఊహించుకున్నారు. అయితే ఎట్టకేలకు ప్రెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించనున్నాడు. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కథానాయికలుగా అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు.
అయితే ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కొద్ది రోజుల క్రితం తమ ట్విట్టర్ లో తెలిపింది.అలీయా భట్ గురించి అందరికీ తెలుసు కానీ… ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్ అని అందరూ ఆసక్తిగా గూగుల్ చేస్తున్నారు. డైసీ ఎడ్గర్ జోన్స్… హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. హాలీవుడ్‌లో 22 ఏళ్ల క్రితమే ‘కోల్డ్ ఫీట్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది డైసీ. ఆ తర్వాత గత ఏడాది విడుదలైన ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలోనూ నటించింది.. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్‌ని ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుదల చేయనున్నారు.