టాలీవుడ్ యంగ్ హీరో, ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. డల్లాస్ లో పని చేస్తున్న శాస్త్రవేత్త దీపిక రాజుతో సుమంత్ అశ్విన్ వివాహం జరిపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
ఫిబ్రవరి 13న దీపిక రాజుతో సుమంత్ అశ్విన్ వివాహం జరగనుందని నిర్మాత ఎంఎస్ రాజు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ దీపిక చాలా మంచి అమ్మాయి అని, తన తనయుడు సుమంత్ అశ్విన్, దీపిక ల పెళ్ళికి సంబంధించిన అన్ని వ్యవహారాలను తాను స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటున్నట్టు తెలిపారు.
మూడు రోజులు జరగబోయే ఈ సాంప్రదాయ తెలుగు వివాహానికి 100 మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. నిర్మాత ఎంఎస్ రాజు ఫామ్‌హౌస్‌లో సుమంత్ అశ్విన్, దీపికల వివాహం జరగనుంది.
ఇక ఈ వేడుకలో కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా 2021లో వివాహం చేసుకోబోయే మొదటి టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కావడం విశేషం.