రైతుల ప్రయోజనాల కోసం గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన రైతు వేదికలు వారికి ఎంతో ఎంతో ఉపయోగ పడతాయని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండల కేంద్రంలో జరుగుతున్న రైతు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మనత్రి మాట్లాడుతూ లాభదాయకమైన పంటలను పండించేందుకు అవసరమైన సూచనలు శిక్షణ కార్యక్రమాలు లభిస్తాయని అన్నారు.
రైతులు తాముపండించిన ఉత్పత్తులకు సంబంధించి పరస్పరం చర్చించుకోవడం, మంచి ధరలను పొందేందుకు రైతు వేదికలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పలువురు రైతులు పాల్గొన్నారు.