శ్రీవారిని ద‌ర్శించుకున్న ఎస్ఇసీ నిమ్మ‌గ‌డ్డ‌

152
SEC Nimmagadda

ఏపీ ఎన్నికల ప్ర‌ధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయ‌న‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆ త‌ర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయ‌న‌కు అర్చకులు అందజేశారు. అనంత‌రం నిమ్మ‌గ‌డ్డ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు కూడా ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల‌ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భార‌త్ ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో నిర్మిస్తోన్న అయోధ్య రామాల‌య నిర్మాణానికి ప్రజలు విరాళాలిస్తున్నార‌ని ఆయన పేర్కొన్నారు.