హైస్కూల్‌లో అగ్నిప్రమాదం..విద్యార్థులు సురక్షితం!

191
Fire accident

హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురలో ఉన్న శ్రీనివాస హైస్కూల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాఠశాల సిబ్బంది, స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉన్న 23 మంది విద్యార్థులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే శ్రీనివాస హైస్కూల్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కార్యాలయం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన పాఠశాల సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమ అందించారు.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.