కల్పకవనం పార్క్‌ను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు

171
Harish Rao, IK Reddy

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలి ఈ పరిధిలని సంగాపూర్‌ వద్ద కల్పకవనాన్ని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. దీంతో పప్రపంచం అంతా తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు.

రేపటి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారన్నారు. అర్బన్‌ పార్క్‌కు పరిసర ప్రాంతాల ప్రజలు వన భోజనాలు, పిల్లలతో విహార యాత్రలకు పార్క్‌ వద్దకు రావాలని సూచించారు.

పిల్లలకు ఎంత ఆస్తిని ఇచ్చామనేది కాదని… చక్కటి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్లం కావాలన్నారు. ఢిల్లీ ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళ్తున్నారన్నారు.

అనంతరం అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సంగాపూర్‌లో కల్పకవనం పార్క్‌ను 292.5 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో అర్బన్‌ పార్క్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తక్కువ సమయంలో రాష్ట్రంలో నాలుగు శాతం అడవులను అభివృద్ధి చేశామన్నారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో నశించిన అడవుల పునరుద్ధరణ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.