రాజశేఖర్ “శేఖర్” మూవీ ఫస్ట్ లుక్

227
Shekar First Look Out

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ 59వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రం “శేఖర్” టైటిల్, ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

“శేఖర్” ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు లలిత్ “శేఖర్” చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మికలు ఇతర నిర్మాతలతో కలిసి “శేఖర్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ థ్రిల్లర్ కోసం ట్యూన్స్ కంపోజ్ చేయనున్నారు.

కాగా రాజశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

“అతి భయంకరమైన కోవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా, మీ ప్రేమ, అభిమానం, మరియు మీ నిరంతర ప్రార్థనలతో, నన్ను మళ్ళీ ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్ళైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ మీకు ఋణపడి ఉంటాను” అంటూ రాజశేఖర్ పోస్ట్ చేశారు.

మరోవైపు రాజశేఖర్ నటించిన “అర్జునుడు” అనే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం మార్చిలోనే తెరపైకి రావాల్సి ఉండగా… లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.

కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.