టాలీవుడ్ యంగ్ హీరో, ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.
బంధువుల అమ్మాయి, హైదరాబాద్ కు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోబోతున్నాడు.
వీరి వివాహం ఫిబ్రవరి 13న అంటే శనివారం హైదరాబాద్ లోని వారి ఫామ్ హౌస్ లో జరగనుంది. వాలంటైన్స్ డే సమయంలో సుమంత్ పెళ్లి చేసుకోబోతుండటం విశేషం.
సుమంత్ పెళ్లి వేడుక పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది. సుమంత్ పెళ్ళికి సంబంధించిన సంబరాలు ఇప్పటికే మొదలు పెట్టేశారు.
తాజాగాసుమంత్ అశ్విన్ , దీపికల హల్దీ, మెహెందీ వేడుకలు జరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సుమంత్ మెహెందీ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఇద్దరూ సుమంత్ దీపిక సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్నారు.