అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

237
Farmer suicide jumping flames

తెలంగాణలోని నల్గొండ‌ జిల్లాలో అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటన జిల్లాలోని కట్టంగూర్‌ మండలం చిన్నపురి గ్రామంలో నిన్న వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మార్నేని మధుమోహన్‌ (44) జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పై ఆఫీసర్ల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌ లో రాసి పెట్టాడు.

సూసైడ్‌నోట్‌ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.