మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ : “గుచ్చే గులాబీలాగా” లిరికల్ వీడియో సాంగ్

380
Guche Gulabi Lyrical Video from Most Eligible Bachelor

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనేతాజాగా ఈ చిత్రం నుంచి ప్రేమికుల రోజు కానుకగా రొమాంటిక్ సాంగ్‌ ‘గుచ్చే గులాబీలాగా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

ఈ సినిమా జూన్ 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, టీజర్, సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ చిత్రంతోనైనా అఖిల్ హిట్ అందుకుని అక్కినేని అభిమానులను ఖుషి చేస్తాడేమో చూడాలి.