సల్మాన్ కోసం విలన్ గా మారిన ఇమ్రాన్ హష్మి…!

223
Emraan Hashmi the antagonist opposite Salman Khan in Tiger 3

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కత్రినా కైఫ్ సల్మాన్ తో జోడి కడుతోంది. యాక్షన్ థ్రిల్లర్ టైగర్ సిరీస్ లో మూడో సినిమాకి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ మార్చిలో ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రారంభం కానుంది. టైగర్-3 చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి మాఫియా డాన్ గా కనిపిస్తాడని సమాచారం.

బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న ఇమ్రాన్ హష్మీకి వరుస పరాజయాలు ఎదురవుతుండడంతో ఇటీవల కాలంలో పూర్తిగా జోనర్ మార్చేశాడు.

ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి విలన్ గా మారాడనే విషయం సినిమా ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి విలన్ గా ఇమ్రాన్ హష్మీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.