
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.
ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్.బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర యూనిట్ ఇప్పుడు కోల్‌కతా లో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణను ప్లాన్ చేసింది.
ఈ షెడ్యూల్‌లో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లతో సహా పలువురిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
మరో వైపు నాని నటిస్తున్న డిఫరెంట్ మూవీ “టక్ జగదీష్” ఏప్రిల్ 23న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రొమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు “టక్ జగదీష్” టీం.
ఇక నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇటీవలే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి” అనే సినిమాను ప్రకటించారు.
ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నాజ్రియా నాజిమ్ ఫహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.