కీరవాణి తనయుడి రెండు సినిమాల ప్రకటన… శ్రీసింహ బర్త్ డే…!

228
Srisimha announces Two New Movies

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు.

ఈ క్రమంలో శ్రీ సింహ హీరోగా నటిస్తున్న “తెల్లవారితే గురువారం” చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

ఇందులో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో ఉన్న శ్రీ సింహ సిగ‌రెట్ తాగుతూ క‌నిపించారు. ఈ చిత్రాన్ని మ‌ణికాంత్ జెల్లి తెర‌కెక్కించారు.

ఇక శ్రీ సింహ హీరోగా “భాగ్ సాలే” అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతుంది.

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రైమ్ కామెడీ “భాగ్ సాలే” చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక శ్రీసింహ ఇప్పటికే “మ‌త్తు వ‌ద‌ల‌రా” అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది.