ఇంటిని ఒక చోట నుంచి మ‌రో చోటికి త‌ర‌లించారు

223

ఒక చోట నుంచి మ‌రో చోటికి ఇంటి సామాన్ల‌ను మారుస్తాం కానీ ఇంటిని తీకెళ్ల‌గ‌ల‌మా? డాడీకో లేదా మ‌మ్మీకో ట్రాన్‌స్ఫ‌ర్ అయింద‌నెకోండి సొంత ఇంటిని అక్క‌డికి తీసుకెళ్ల‌గ‌ల‌మా?

కానీ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ ఇంటిని మ‌రో చోటికి త‌ర‌లించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఇంటిని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరే చోటికి తరలించారు. అది కూడా 139 ఏళ్ల పురాతన విక్టోరియా ఇంటిని.

వివరాలోకి వెళితే.. ఫ్రాంక్లీన్ స్ట్రీట్‌లో (శాన్‌ఫ్రాన్సిస్కో) 1880లో ఇటాలియనేట్ స్టైల్‌లో ఈ భవనాన్ని నిర్మించారు.

807 నంబరు అడ్రస్‌తో గల ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. రెండు అంతస్తుల ఆ ఇంటిలో ఆరు బెడ్ రూమ్‌లు, 3 స్నానాల గ‌దులు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఇంటి యజమాని అక్కడి నుంచి మార్చాల్సి వ‌చ్చింది.

ఈ క్రమంలోనే తాను ఎంతో ఇష్టపడి క‌ట్టుకున్న ఆ ఇంటిని అక్క‌డే వ‌ద‌ల‌లేక మరోక చోటుకు తరలించేందుకు నిపుణులను సంప్రదించాడు. ఈ భవంతి తరలింపు అనేది అంతా సులువైన ప‌నేమీ కాదు.

ఈ ఇంటిని తరలించడానికి ఏనిమిదేళ్లుగా ప్రణాళికలు రచించారు. ఇంటిని తరలించే మార్గంలో చెట్ల కొమ్మలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, విద్యుత్ లైన్స్‌ను తాత్కాలికంగా తొలగించారు.

అలాగే పలు ప్రభుత్వ సంస్థల అనుమతులు తీసుకున్నారు. త‌ర్వాత చాలా జాగ్రత్తగా బిల్డింగ్‌ను లిఫ్ట్ చేసి ట్రాలీ మీద పెట్టారు.

పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో దానిని ఆపరేట్ చేస్తూ అక్కడి నుంచి ఆరు బ్లాక్‌ల అవతల ఉన్న ఫుల్‌ట్రాన్ స్టీట్‌కు తీసుకొచ్చారు.

అత్యధికంగా గంటకు ఒక మైలు వేగంతో ఈ తరలింపు ప్రక్రియను పూర్తి చేశారు. ట్రాలీపై రోడ్డు మీద తరలివెళ్తున్నఆ భవంతిని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున్న చేరుకున్నారు.

ఇక ఈ బిల్డింగ్‌ను తరలించడం కోసం ఆ ఇంటి యజమాని మొత్తంగా నాలుగు లక్షల డాలర్లు ఖర్చు చేశాడ‌ట‌