మహేష్ చేతుల మీదుగా “శ్రీకారం” టీజర్

188
SreekaramTeaser Launch by Mahesh Babu tomorrow

కిశోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “శ్రీకారం”. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా “శ్రీకారం” సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రేపు (మంగళవారం) సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది.

ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ చిత్రంలో శర్వానంద్ యువ రైతుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీకారం’ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల కాబోతోంది.