“జాంబిరెడ్డి” మూడు రోజుల కలెక్షన్స్

146
Zombie Reddy 3 Days Collections

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ (‘ఇంద్ర’ ఫేం) హీరోగా పరిచయమైన చిత్రం “జాంబి రెడ్డి”. ఆనంది, దక్ష నగార్కార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ నిర్మించారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

జాంబి జోనర్‌లో కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “జాంబి రెడ్డి”లో రఘుబాబు, పృథ్వీరాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ అందించారు. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది.

తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్‌కి చేరువైందని తెలుస్తోంది. మొత్తంగా మూడో రోజుకు గాను 1.6 కోట్ల నెట్, 2.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తొలి వీకెండ్ ముగిసేసరికి మొత్తంగా 4.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.


తొలి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 1.5 కోట్ల గ్రాస్, 91 లక్షల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అదే ఫామ్ కొనసాగించింది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉందని తెలిసింది. ఇక మూడో రోజు వీకెండ్ (ఆదివారం) కావడంతో కలెక్షన్స్‌ ఫరవాలేదన్పించాయి.

ఏరియా వారీగా చూస్తే…
తూర్పు గోదావరి – 10 లక్షలు
పశ్చిమ గోదావరి – 9 లక్షలు
గుంటూరు – 16 లక్షలు
కృష్ణా – 14.4 లక్షలు
నెల్లూరు – 9 లక్షలు
నైజాం – 56 లక్షలు
సీడెడ్ ‌- 29 లక్షలు
ఉత్తరాంధ్ర – 17 లక్షలు