భర్తతో విడాకులపై శ్వేతాబసు షాకింగ్ కామెంట్స్

513
Shwetha Basu Prasad Shocking Comments on her Divorce

హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ తన విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్వేతా బసు గత సంవత్సరం రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

కానీ ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే జీవిస్తోంది.

ఇక ఇప్పడు ఆమె సినిమాలతో బిజీ కావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది.

శ్వేతా బసు ప్రసాద్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నానని,

తన వైవాహిక జీవితం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని ఊహించలేదని చెప్పింది.

కాకపోతే ఇప్పుడే స్వేచ్ఛగా ఉందని, భర్తతో విడిపోయాకే అసలైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని,

తాము విడాకులు తీసుకున్నామనే పెద్దపెద్ద పదాలు వద్దని, అది జస్ట్ బ్రేకప్ అంతే అని శ్వేతా బసు పేర్కొంది.

ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ చేస్తున్న మూవీ ‘ఇండియా లాక్‌డౌన్‌’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సెక్స్ వ‌ర్క‌ర్ పాత్ర‌లో శ్వేత న‌టిస్తోంది.

ఈ పాత్రలో రియాలిటీగా కనిపించాలనే టార్గెట్ పెట్టుకొని ఇటీవలే ముంబై రెడ్‌లైట్ ఏరియాను కూడా సందర్శించింది ఈ హీరోయిన్.

కాగా ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు… ఆ సినిమాతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది.

కానీ ఆ తరువాత ఒక్క హిట్ ను కూడా అందుకోలేకపోయింది.