
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా షేర్ చేసిన జిమ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన తమన్నా “మన మెదడు చెప్పినట్లు విని కష్టపడితే అందమైన శరీరాకృతి మన సొంతమవుతుంది” అని కామెంట్ చేసింది.
ఈ పిక్ సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో షేర్ అవుతోంది.
View this post on Instagram
ఇటీవలే కోవిడ్‌కు గురై కోలుకున్న తమన్నా ప్రస్తుతం తన ఫిట్‌నెస్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టింది. అందుకు తగ్గట్లుగా జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది.
గత దశాబ్ద కాలంగా సౌత్ లో వెండి తెరపై సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటీ. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా వెలుగొందుతోంది.
ప్రస్తుతం మూడు పదుల వయసులోనూ ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే “ఎఫ్ 3″లో నటిస్తోంది.