కిశోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “శ్రీకారం”. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా “శ్రీకారం” సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Presenting the teaser of #Sreekaram! Good luck to the entire team for its release on March 11th 😊https://t.co/BWXy07BLvy@ImSharwanand @Im_bkishor @MickeyJMeyer @14ReelsPlus @RaamAchanta
— Mahesh Babu (@urstrulyMahesh) February 9, 2021
టీజర్ చూస్తే… ఓ హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్. .ఒక ఇంజినీర్ తన కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు.
కానీ ఒక రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది..అంటూ శర్వానంద్ చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తున్నాయి.
మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.