“వకీల్ సాబ్”లో యాంకర్ రష్మీ?

252
Rashmi Gautam To Play Item Song in Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ ఎంట్రీ చిత్రం “వకీల్ సాబ్”. ఈ చిత్రం హిందీ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ కీలకపాత్ర పోషిస్తోంది.

ఏప్రిల్ 9న పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ క్రమంలో ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హుషారెత్తించే ఓ స్పెషల్ సాంగ్ కోసం జబర్దస్త్ బ్యూటీ రష్మీని దించబోతున్నారట దర్శకనిర్మాతలు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేసింది.

తాజాగా చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఆతృతను పెంచేస్తోంది. మరి ఈ వార్తపై “వకీల్ సాబ్” చిత్రబృందం ఏమంటుందో చూడాలి.

కాగా ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు మేకర్స్.

తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిత్రంలో ఎన్నో మార్పులు చేశారు.