సోన‌మ్ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ రెడీ..!

348
sonam-kapoor-wedding-invitation-viral-in-social-media

శ్రీదేవి మ‌ర‌ణంతో విషాదంలో మునిగిన క‌పూర్ ఫ్యామిలీ ఇప్పుడు సోన‌మ్ క‌పూర్ పెళ్ళి హడావిడితో కాస్త విషాదం నుండి తేరుకున్న‌ట్టు క‌నిపిస్తుంది . కొద్ది రోజులుగా అనీల్ క‌పూర్ త‌నయ సోన‌మ్ క‌పూర్ త‌న బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకుంటుంద‌ని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై సోన‌మ్ ఎప్పుడు స్పందించ‌లేదు. అయితే ఇటీవ‌ల సోన‌మ్ ఇంటికి విద్యుద్దీపాల‌తో అలంక‌ర‌ణ చేస్తుండ‌డంతో ఆ ఇంట పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంద‌ని అభిమానులు డిసైడ్ అయ్యారు. నిన్న ఇటు క‌పూర్ ప్యామిలీ, అటు అహుజా ఫ్యామిలీ కూడా వీరి పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

అయితే తాజాగా సోన‌మ్‌, ఆహుజాల వెడ్డింగ్ ఇన్విటేష‌న్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లుకొడుతుంది. ఇందులో మే 8… మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30 వ‌ర‌కు వివాహం జ‌రుగుతుంద‌ని ఆ త‌ర్వాత లంచ్ ఉంటుంద‌ని ఉంది. ముంబైలోని బాంద్రాలో జ‌ర‌గ‌నున్న ఈ పెళ్ళి వేడుక‌కి ప్ర‌తి ఒక్క‌రు ఇండియ‌న్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్ ధ‌రించి రావాల‌ని కోరారు క‌పూర్‌, అహుజా ఫ్యామిలీస్‌. సోన‌మ్ పెళ్ళికి బాలీవుడ్ అంతా త‌రలిరానుంద‌ని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే భారీ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మై ఉంది క‌పూర్ ఫ్యామిలీ. పెళ్లికి రెండు రోజుల ముందు సంగీత్‌, మెహందీ వేడుక‌ల‌ని గ్రాండ్‌గా జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది.