మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆహ్వానం

463
admissions-open-for-women-degree-colleges

తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకొని శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గ్రామంలోని గిరిజన కళాశాలలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు వరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.