బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన ప్రియాంక చోప్రా బేవాచ్ అనే సినిమాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలతో పాటు క్వాంటికో సీరియల్ కూడా చేస్తుంది. త్వరలో సల్మాన్ చిత్రంతో మళ్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్ అనే చిత్రంలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుంది. అయితే ఇటీవల తన చేతికి మంగసూత్రంలా ఉన్న బ్రాస్లెట్ ఒకటి కనిపించడంతో ప్రియాంక సీక్రెట్‌గా వివాహం చేసుకుందా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే అనుష్క- విరాట్‌లు సీక్రెట్ మ్యారేజ్ చేసుకోగా దీపిక-రణ్‌వీర్, సోనమ్- ఆహుజాలు కూడా అదే దారిలో వెళుతున్నారని ఇప్పుడు ప్రియాంక కూడా వారినే ఫాలో అవుతుందా అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా కాస్త నవ్వుతూ .. నా పెళ్లిపై వస్తున్న వార్తలని ఆపండి.. ఇది కేవలం దిష్టి తగలకుండా కట్టుకున్నాను. నేనేమి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోను.పెళ్లి చేసుకుంటే కచ్చితంగా చెబుతాను అంటూ తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టింది. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది.
https://t.co/EkUEgfbO75
Hahahah!heights of speculation! This is an evil eye guys! Calm down! I’ll tell u when I get married and it won’t be a secret! Lol pic.twitter.com/WPdIxXIx1I— PRIYANKA (@priyankachopra) April 30, 2018