లవ్లీ పిక్ షేర్ చేసిన సింగర్ సునీత… పిక్ వైరల్

388
Singer Sunitha Honeymoon Trip Pic Goes Viral

ప్రముఖ సింగర్ సునీత రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన హనీమూన్ పిక్ షేర్ చేస్తూ ప్రేమికుల రోజు సందర్భంగా లవ్లీ మెసేజ్ పెట్టింది సునీత. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

తన భర్తతో కలిసి అందమైన ప్రదేశం మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వేసింది. ఆమె తన భర్త రామ్‌తో జాలీగా గడుపుతోంది.

‘లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్’‌ అంటూ మోడ్రన్ లుక్‌లో ఉన్న తన పిక్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటోంది.

ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

అంతేకాదు సముద్ర తీరాన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాట కూడా పాడి ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది సునీత.

జనవరి 9వ తదీన మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడింది సునీత. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

సునీత పిల్లలిద్దరూ దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అప్పటినుంచి సునీత పెళ్లి విషయంపై వార్తలు వస్తూనే ఉన్నాయి.