బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-4 ద్వారా నటుడు సోహెల్ మంచి పాపులారిటీని సంపాదించిన విషయం తెలిసిందే.
తాజాగా సోహెల్ కొత్త కారును కొన్నాడు. ఈ విషయాన్ని సోహెల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
తండ్రితో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలు షేర్ చేసిన సోహెల్ “మా నాన్న నాకు ఆదర్శం. ఆయన బ్లెస్సింగ్స్ వలన, బిగ్ బాస్ కారణంగా కొత్త కారు కొనడం సాధ్యమైంది” అని తెలిపాడు.
View this post on Instagram
బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ కారణంగా సోహెల్ లైఫ్ పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. కాని ఆ సమయంలో అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.
బిగ్ బాస్ తరువాత సోహెల్ అందరికీ సుపరిచితుడు అయ్యాడు.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక సోహెల్ వరుస ఇంటర్వ్యూలు, షోస్, సినిమాలు ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది.