
అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న “బ్రహ్మాస్త్ర” చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, మళయాలం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
రణ్‌బీర్, అలియా, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం భారీ సెట్ లో నడుస్తోంది. తాజాగా కింగ్ నాగార్జునకి సంబంధించిన షూటింగ్ ముగిసినట్లుగా బ్రహ్మస్త్ర టీమ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని కింగ్ నాగార్జున తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. రణ్‌బీర్, అలియాతో కలిసి పని చేయడం సంతోషంగా అనిపించిందని, ఓ సాధారణ ప్రేక్షకుడిగా ఈ సినిమా విడుదల కోసం నేను కూడా వేచి చూస్తున్నాను అని నాగ్ ట్వీట్ ద్వారా తెలిపారు.
And it’s a wrap for me on #Brahmāstra . Such an amazing experience it has been with our stellar performers #Ranbir and @Aliaa08. Can’t wait for you guys to witness the outstanding world #AyanMukerji has created.#TheBigIndianMovie #Brahmastra pic.twitter.com/CvKBAVphnt
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 16, 2021
ఇక కింగ్ నాగార్జునకు దేశ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. నాగార్జున 1990లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత ‘ద్రోహి’, ‘ఖుదా గవా’, ‘క్రిమినల్’, ‘జక్మ్’ వంటి హిందీ సినిమాల్లో నటించారు.
2003లో వచ్చిన ‘ఎల్.ఓ.సీ కార్గిల్’ హిందీ సినిమాలో చివరిసారిగా ఓ పాత్రలో నటించారు.
మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత బ్రహ్మాస్త్రా అనే హిందీ మూవీలో నటించారు.