“రూహి” ట్రైలర్… భయపెట్టిస్తున్న జాన్వీ క‌పూర్

184
Roohi trailer: Janhvi Kapoor turns ghost

స్టార్ హీరోయిన్ జాన్వీ క‌పూర్, రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న హార్రర్ థ్రిల్లర్ “రూహి”. డైరెక్టర్ హార్దిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతకుముందు రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం “స్త్రీ”. ఈ సినిమాకు సీక్వెల్ గా “రూహి” తెరకెక్కుతోందని అంటున్నారు. ని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో “రూహీ అఫ్జానా” అనే పేరుని మూవీకి ఫిక్స్ చేయ‌గా, ఇప్పుడు రుహిగా మార్చారు.

ఈ చిత్రంలో సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్, వ‌రుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్ లు కీలక పాత్రల్లో న‌టించారు. “రూహి” చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా “రూహి” ట్రైల‌ర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో హార్ర‌ర్, కామెడీ స‌న్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

కాగా “రూహి” గతేడాదే విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.