ఆసక్తి రేపుతున్న శుభలేఖ+లు టీజర్

652
shubhalekha plus lu telugu movie teaser

ఇప్పుడు ట్రెండ్ మరీ మారిపోయింది.. కొత్తగా వస్తున్న మూవీ టీజర్ చూస్తుంటే.. అబ్బాయి అయినా కొంచెంలో కొంచెం కంట్రోల్ లో ఉంటున్నారేమో గానీ.. అమ్మాయిలా అమ్మో అనాల్సి వస్తుందనే విధంగా ఉంది. ఈ టీజర్ ఏ సినిమాలోనిదో తెలుసా.. శుభలేఖ+లు (శుభలేఖ ప్లస్ లు). ప్రియా వడ్లమాని అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ శరత్ నర్వాడే దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. టీజర్ వెరైటీగా ఉంది అనుకున్నా.. మరీ బోల్డ్ గా.. లేడీ అర్జున్ రెడ్డి మూవీ సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వినని వారు కూడా టీజర్ ద్వారా దగ్గర అయ్యారు.

హీరోయిన్ మందు కొట్టటం, సిగరెట్ కాల్చటం లేటెస్ట్ మూవీస్ లో కామన్. మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. పెళ్లి దుస్తులు దగ్గర పెట్టుకుని.. పెళ్లి మేకప్ వేసుకున్న తర్వాత సిగరెట్ కాలుస్తూ.. ఉండటం చూస్తుంటే.. మరీ ట్రెంట్ ఎక్కువ అయినట్లు కనిపించింది. నీకు నువ్వే.. మాకు మేమే అంటూ ఓల్డ్ సాంగ్ రేడియో నుంచి వస్తుంది. ఓవరాల్ గా టీజర్ చూస్తే లేడీ అర్జున్ రెడ్డిని తీయబోతున్నాడు అంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ మూవీలో శ్రీనివాస సాయి, దీక్ష శర్మరైనా, వంశీ రాజ్ నటిస్తున్నారు.