తీన్ మార్ న్యూస్ : కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలను విశ్లేషిస్తూ ఏఐసీసీకి ఆయన లేఖ రాశారు. రాజీనామాకు గల కారణాలను రేపు మీడియా ముందు వెల్లడిస్తానని నాగేందర్ స్పష్టం చేశారు. 1994, 1999, 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దానం నాగేందర్. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు.