ఈ రోజు రాశి ఫలాలు – 23 శనివారం జూన్ 2018

462
horoscope-details

మేషరాశి : ఈరోజు శారీరకంగా బాగున్నప్పటికీ, మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. పని చేయాలనే ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. బంధువులను కలుసుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూలం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

మిథునరాశి : ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

కర్కాటకరాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, బదిలీ కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులు, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహరాశి : ఈరోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్యరాశి : ఆర్థికంగా ఈరోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో కానీ, శుభకార్యాల్లో గాని పాల్గొంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి.

తులరాశి : మీ ప్రవర్తన కారణంగా మిత్రులతో సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

వృశ్చికరాశి : మీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

ధనుస్సురాశి : ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సాయం చేయటం కానీ, తన సాయం అందుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రయాణం కానీ, దైవ దర్శనం కానీ చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

మకరరాశి : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా, నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కుంభరాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మీనరాశి : ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి పనుల్లో సాయం చేస్తారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది.