36 ఏళ్ళ వయస్సులోను శ్రియ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న ఈ అమ్మడు తన భర్త ఆండ్రీతో కలిసి ఐబిజా బీచ్ కు వెళ్లింది. అక్కడ స్టేప్పులు వేసిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక తాజాగా తను ఉన్న హోటల్ బాల్కనీలో నైట్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బార్సిలోనాలో మరో రెయినీ డే అంటూ ఆ వీడియోకి కామెంట్ పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కోలీవుడ్‌లో సండకారి అనే సినిమా చేస్తుంది శ్రియశరన్ . విమల్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.