ఏపి లో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం

324
special incentives

ఏపి ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త తెలిపింది. రూ.10వేలు ఆర్థిక సాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఏడాదికి ఒకసారి ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా సొంత ఆటో, క్యాబ్‌ను నడిపేవారు ఈ ఆర్థిక సాయం అందుకునేందుకు అర్హులు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.. తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సెప్టెంబర్ నెలాఖరులోనే ఈ ఆర్థిక సాయాన్ని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అందజేయనున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కలిసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని.. తమను ఆదుకోవాలని కోరారు. తమ సమస్యలను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జగన్.. రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రచారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి.. పథకం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అర్హులను గుర్తించే పనిలో పడ్డారు.