కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. పెర్‌ఫార్మెన్స్ ఒరియెంటెడ్ పాత్రల్లోనూ మెప్పించిన కథానాయిక శ్రియ. ‘ఇష్టం’(2001)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ.. ఆ తర్వాత ‘సంతోషం’, ‘నువ్వే నువ్వే’, ‘నేనున్నాను’, ‘మనం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. పదహారేళ్లుగా నటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రి కొస్చీవ్‌ను శ్రియ పెళ్లాడనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ అయ్యింది. ఉదయపూర్‌లో మార్చి 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ వివాహమహోత్సవం ఘనంగా జరుగనుందని తెలిసింది. రిసెప్షన్‌ను కూడా అంతే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారని.. దానికి సంబందించిన తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తారని శ్రియ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా వుంటే.. వెంకటేష్, తేజ కాంబినేషన్‌లో రానున్న ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమాలో శ్రియ కథానాయికగా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళనుంది.