ముఖ్యమంత్రి కి త్రుటిలో తప్పిన ప్రమాదం

351
cm-kcr-escape-chopper-accident

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని కమ్యునికేషన్‌ బ్యాటరీ కిట్‌ బ్యాగ్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ కిట్ బ్యాగ్‌ను దూరంగా తీసుకెళ్లి బయటకు పడేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కేసీఆర్‌ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లాలోని ముర్మూర్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 

మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. సీఎం కార్యాలయ అధికారులతో తాను సంప్రదించినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగానే ఉందని, సీఎం పర్యటన యథావిధిగా కొనసాగుతుందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘చింతించాల్సిన అవసరం లేదు … ఆల్‌ ఇజ్‌ వెల్‌’ అని కేసీఆర్‌ కుమార్తె ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు.