ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 3 రోజుల హైదరాబాద్ పర్యటనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సిటీలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
మంగళవారం: మధ్యాహ్నం 1.25 నుంచి 2.15 వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు, శ్యాంలాల్ బిల్డింగ్, సిఎం క్యాంప్ ఆఫీస్, పంజాగుట్ట ఫ్లైఓవర్, శ్రీనగర్ టీ జంక్షన్, కేబీఆర్ పార్క్, రోడ్ నెంబర్ 12వరకు.
సాయంత్రం 4.15 నుంచి 5.05గంటల వరకు రోడ్ నెంబర్ 12, కేన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ టెంపుల్ జంక్షన్, మాదాపూర్ వరకు. సాయం త్రం 5.45 నుంచి 6.35 గంటల వరకు మాదాపూర్, పెద్దమ్మటెంపుల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఒరిస్సా ఐలాండ్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు.
బుధవారం: సాయంత్రం 4.35 నుంచి 5.35 వరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఏసీబీ ఆఫీస్, సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఆఫీస్, మాసాబ్ ట్యాంక్, సరోజినిదేవి హాస్పిటల్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఆరాంఘర్, పోలీస్ అకాడెమీ వరకు.
సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు పోలీస్ అకాడెమీ, ఆరాంఘర్, గగన్‌పహాడ్, శంషాబాద్ నుంచి తిరిగి ఆరాంఘర్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, మాసాబ్‌ట్యాంక్, ఖాజామెన్షన్, ఏసీబీ ఆఫీస్, బంజారాహిల్స్ వరకు.
మార్చి 1, గురువారం: ఉదయం 11.15నుంచి 12.05 గంటల వరకు బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12, ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, సిఎం క్యాంప్ ఆఫీస్, బేగంపేట్ ఫ్లై ఓవర్, బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.