మెట్రో రైలులో త్వరలో మంత్లీ పాసులు తీసుకువస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను పరిగణలోకి తీసుకొని మెట్రోరైళ్ల ఫ్రీకెన్సీ పెంచడంతో పాటు మరింత వేగంగా రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా మెట్రో ప్రయాణికులు మంత్లీ పాసులు కావాలని కోరుతున్నారని, దానికి అనుగుణంగా ఎల్ అండ్ టీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. మెట్రోరైళ్లు, స్టేషన్‌లలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యేకంగా పరిశీలించామన్నారు. మెట్రో కారిడార్‌లలో చేపట్టిన సుందరీకరణ పనులు బాగున్నాయని, అదే తరహాలో మిగతా కారిడార్‌లలో కల్పిస్తామన్నారు.