కార్డ్ పోయిందా ?? డోంట్ వర్రీ

944
lost your card ? don't worry

ప్రస్తుత సాంకేతిక యుగంలో మనిషి జీవితం కార్డుల చుట్టూ తిరుగుతున్నది. ఎటిఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డుల వరకు రోజువారీ జీవితం లో భాగమయ్యాయి. అందుకే వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. వొక్కోసారి పర్స్ పోయినప్పుడో , జిరాక్స్ తీసుకునే సందర్బం లోనో ఇతరత్రా కారణాలవల్ల కార్డులు పోయినప్పుడు కాళ్ళు చేతులు ఆడవు. వాటిని ఎలా పొందాలో తెలియక తల్లదిల్లుతాం. కాని కార్డులు పోయినపుడు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కొంత సమయం తీసుకున్నా, వాటిని తక్కువ ఖర్చుతోనే పొందవచ్చు . అదెలాగో ఒక్కసారి చూద్దాం.ఏ కార్డ్ ఐనా తిరిగి పొందటం ఎలా

ఆధార్ కార్డ్

ఈ కార్డ్ పోతే టోల్ ఫ్రీ నెంబర్ 18001801947 కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డ్ మళ్ళీ పోస్ట్ లో పంపిస్తారు. help@uidai.gov.in అనే వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పొందే అవకాశం వుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన మీ-సేవా కేంద్రాల్లో పుట్టిన తేది తప్ప మరే ఇతర సమాచారాన్నయినా సరైన ఆధారాలు చూపి మార్చుకునే వీలుంది.

రేషన్ కార్డ్

కుటుంబ అవసరాలకు ఈ కార్డ్ చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డ్ ఉపయోగపడుతుంది. తెల్ల కార్డ్ వుంటే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అందువల్ల పేద ప్రజల జీవితం లో ఈ కార్డ్ కు ఎనలేని ప్రాధాన్యముంది. రేషన్ నంబర్ తో స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో సంప్రదించటం ద్వారా పరిశీలన జరిపి అదే నంబర్ పై నామ మాత్రపు రుసుము తో కొత్తది జారీ చేస్తారు. www.icfs2.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వివరాలు తెలియజేసి జిరాక్స్ కాపి పొందవచ్చు.

వోటరు గుర్తింపు కార్డ్

కేవలం ఓటు వేయడానికే కాకుండా కొన్ని సార్లు నివాస , పుట్టిన తేది ధ్రవీకరణ కోసం ఈ కార్డ్ పనికి వస్తుంది. ఈ కార్డ్ ను పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్ కార్డ్ నంబర్ తో పది రూపాయలు చెల్లించి మీ సేవా కేంద్రం లో మల్లి ఈ కార్డ్ ను పొందవచును. నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డ్ ను ఉచితంగా అందజేస్తారు. మరింత సమాచారం కోసం www.ceotelangana.nic.in ని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.పాన్ కార్డ్

ఆర్దిక లావాదేవీల్లో పాన్ కార్డ్ ప్రస్తుతం చాల కీలకం. ఆదాయపన్ను శాఖ అందజేసే పర్మినెంట్ ఎకౌంటు నెంబర్ , కార్డ్ పోగొట్టుకుంటే సంబందిత ఎజేన్సీ లో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తో పాటు పాత పాన్ కార్డ్ జిరాక్స్ , రెండు కలర్ ఫోటోలు , నివాస, గుర్తింపు ధృవీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డ్ కోసం మరో 90 రూపాయలు చెల్లించాలి. కొత్త కార్డ్ వచ్చేందుకు మూడు వారాల సమయం తీసుకోవచ్చు. www.nsdlpan.com వెబ్ సైట్ లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

ఏటీఎం కార్డ్

ఈ కార్డ్ కోల్పోయిన వెంటనే సంబందిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రం లో ఫిర్యాదు చేసి వారు అడిగిన పూర్తి సమాచారం అందించి కార్డ్ ను బ్లాక్ చేయించాలి. తర్వాత మీరు పొందే ఫిర్యాదు నెంబర్ ని సంబందిత బ్యాంకు మేనేజర్ కు తెలియజేయాలి. ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాక కొత్త కార్డ్ ను జారీ చేస్తారు.

 

పాస్ పోర్ట్

పాస్ పోర్ట్ ను పోగొట్టుకుంటే ముందుగ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి లభించక పోతే నాన్ ట్రేస్డ్ ధృవపత్రం జారి చేస్తారు. అనంతరం పాస్ పోర్ట్ అధికారి, హైదరాబాద్ పేరిట రూ. వెయ్యి కి డీ డీ తియ్యాలి. ఈ రెండింటిని జత పరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. ఇందుకు మూడు నెలలు పట్టవచ్చు . తత్కాల్ పాస్ పోర్ట్ అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీ ని సంప్రదించాలి.


డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబందిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికేట్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ని లాస్ ఆర్ డిస్ట్రర్షన్ అఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం ఎల్ ఎల్ డీ తో రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం లో అందించాలి . పది రూపాయల బాండ్ పేపర్ పై కార్డ్ పోయిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. www.tstransport.org.in అనే వెబ్ సైట్ నుంచి ఎల్ ఎల్ డీ ఫారం ను డౌన్లోడ్ చెసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.