సరదా కేళి హోళి దగ్గరకొచ్చేస్తోంది. రంగులు పడకుండా ఇంట్లోనే ఉండాలని ఎంత ప్రయత్నించినా కొందరికి అది సాధ్యపడకపోవచ్చు. ఇక, రంగు నీళ్లల్లో మునిగి తేలే యువతీయువకులెందరో. మరి, ఇలాంటి సందర్భాల్లో పొరపాటున మొబైల్ ఫోన్లు తడవొచ్చు. ఫోన్ లోపలికి నీళ్లు పోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే ఫోన్ నీళ్లలో పడిపోవచ్చు. తద్వారా ఖరీదైన స్మా్ర్ట్‌ఫోన్లు పాడైపోయే ముప్పు రావచ్చు. కాబట్టి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఫోన్ నీళ్లలో పడిపోతే చేయాల్సిన, చేయకూడని పనులేంటో మీ కోసం…
1.ఫోన్ నీళ్లలో పడిపోయింది కదా అని చెప్పేసి దానిని ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్‌ను వాడడమో లేదంటే మైక్రోవేవ్ ఒవెన్‌కు దగ్గరగా పెట్టడడమో చేస్తుంటారు కొందరు. అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే మరింత ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2.ఫోన్ నీళ్లలో పడినప్పుడు దానికి చార్జింగ్ పెట్టడం వంటి పనులను అస్సలు చేయొద్దు. అలా చేస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఎక్కువ. అంతేగాకుండా పోర్టులను దానికి అనుసంధానించొద్దు.
3.నీళ్లలో పడిపోయిన వెంటనే ఫోన్‌ను తీసేసి స్విచాఫ్ చేసేయాలి. బాటరీ ని తొలగించాలి. నీళ్లు బయటకు పోయేలా వివిధ కోణాల్లో దానిని దులపరించాలి.
3.ఓ పొడి వస్త్రం తీసుకుని దానిని మంచిగా తుడవాలి. ఫోన్లోని తడంతా పోయేలా కిచెన్ టవల్ లేదంటే టిష్యూ పేపర్‌లో చుట్టాలి. సిమ్ కార్డు, మెమొరీ కార్డులను తీసేయాలి.
4.దాని కన్నా మంచి ఉపాయం ఏంటంటే.. ఆ ఫోన్‌ను తడిని పీల్చుకునే గాలికూడా జోరని బాక్సుల్లో పెట్టాలి. లేదంటే సిలికా సాషెల మధ్య పెట్టాలి.
5.సిలికా పాకెట్లు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి.. ఇంట్లోనే నీటిని తొలగించే చక్కటి ఉపాయం ఉంది. అదే బియ్యం. తడిసిన మొబైల్ ఫోన్‌ను బియ్యంలో పెట్టేస్తే ఆ తేమంతా వెళ్లిపోతుంది. దాదాపు రెండు రోజుల పాటు ఫోన్‌ను బియ్యంలో పెట్టేస్తే తడి వెళ్లిపోతుంది.
6.లేదు ఇంకా తడిపోవాలనుకుంటే సూర్యుడి ఎండలో కూడా ఫోన్ పెట్టాలి. వెనక పానెల్‌ను తీసి ఎండలో పెడితే లోపల ఏమైనా తేమ ఉంటే బయటకు పోతుంది.
7.పూర్తిగా తేమ పోయి బాగు అయిందనుకుంటే వెంటనే ఫోన్లోని సమాచారాన్నంతా లాప్‌టాప్ లేదంటే కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోవాలి.