షారుక్ వాయిస్ ఓవర్ తో ‘ది లయన్ కింగ్’ సినిమా ట్రైలర్

251

డిస్నీ సంస్థ నుండి ‘ది లయన్ కింగ్’ యానిమేష‌న్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ది లయన్ కింగ్ హిందీ ట్రైలర్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. .

తమ అభిమాన హీరో షారుక్ ది లయన్ కింగ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం పట్ల షారుక్ ఫ్యాన్స్ ఎక్సయిట్ మెంట్ ను తెలియజేస్తున్నారు. కేవలం షారుక్ వాయిస్ కోసం ఇంగ్లీష్ కంటే ముందుగానే హిందీ వెర్షన్ ను చూస్తామంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తోపాటు నటుడు ఆశిష్ విద్యార్థి, టిమన్, సంజయ్ మిశ్రా, గోవర్దన్ అస్రాని వివిధ పాత్రలకు వాయిస్ ఓవర్ అందించారు.