. బిగ్‌బాస్ హోస్ట్ గా నాగార్జున…. సీజన్ 3 ప్రోమో విడుదల

260

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జునను మాటీవీ యాజమాన్యం అఫీషియల్‌గా కన్ఫమ్ చేసింది. దానికి సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల చేసింది. ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నానంటూ నాగార్జున డైలాగ్ చెప్పడం.. బాస్ అంటూ ఓ బొమ్మ నాగార్జునను అనడం.. బాస్ కాదు.. బిగ్ బాస్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ సూపర్‌గా పేలాయి. ప్రోమో ప్రకారం కంటెస్టెంట్లు 14 మంది ఉంటారట. 100 రోజులు వాళ్లు హౌజ్‌లో ఉండాలి అని ముందే నాగార్జున ఈ ప్రోమోలో హింట్ ఇచ్చారు.

14 మంది కంటెస్టెంట్ల కోసం కావాల్సిన సరుకులను హోస్ట్ నాగార్జునే మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తున్న వీడియోనే ప్రోమోగా తెరకెక్కించారు. మొత్తానికి నాగార్జున బుల్లి తెరపై మళ్లీ హడావుడి చేయడానికి సిద్ధమై పోయారని బుల్లి తెర అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.