అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లో ఓటమిపాలై ఇంటి ముఖం పట్టింది.
ఈ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన యువ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఘోర పరాజయపాలైంది. దీంతో 24వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ గెలవాలన్న తన ఆశలు అడియాశలయ్యాయి.
సెరెనా 23వ గ్రాండ్ శ్లామ్ ట్రోఫీని 2017లో గెలిచింది. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ రికార్డును సమయం చేయాలన్న సెరెనా కోరిక మరోసారి వాయిదా పడింది.
మహిళల విభాగంలో మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో విజేతగా నిలిచి అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డుల్లో కొనసాగుతోంది.
గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ 6-3, 6-4తో ఒసాకా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఒసాకా మరోసారి ఫైనల్‌కు చేరింది.
మూడుసార్లు గ్రాండ్ శ్లామ్ విజేతగా నిలిచిన ఒసాకా ఈ మ్యాచ్‌లో సెరెనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. రెండు సెట్లలోనూ ఒసాకా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.