కొద్ది సేప‌ట్లో ఐపీఎల్ వేలం

184

క‌రోనా కార‌ణంగా గ‌త ఏడాది దుబాయ్‌లో జ‌రిగిన ఐపీఎల్ ఈ ఏడాది భార‌త్ అభిమాన‌ల‌ను అల‌రించ‌నుంది.

ఈ ఏడాది సీజ‌న్ కోసం ఆట‌గాళ్ల మినీ వేలం ఈ రోజు (18-2-2021) చెన్నైలో జర‌గ‌నుంది. మ‌రి కొద్ది సేప‌ట్లో ఈ వేలం అంటే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

ఈ వేలం పాట‌లో మొత్తం 292 మంది త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు 61 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశ‌ముంది.

భార‌త ఆట‌గాళ్ల‌తో పాటు విదేశీ క్రికెటర్లు ఈ వేలంలో ఉండటం ఆస‌క్తి రేపుతోంది.

ఈ వేలంలో దేశ‌వాళీ కుర్రాళ్ల‌కు మంచి ధ‌ర ప‌లికే అవ‌కాశ‌ముండ‌టంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ వేలంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్ డేవిడ్ మ‌ల‌నేపై అందరి దృష్టి నిలిచింది.

మ‌ల‌న్‌ ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ టీ20 ఆట‌గాడు. దీంతో ఈ సీజ‌న్‌తో మ‌ల‌న్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు గ‌తేడాది ఐపీఎల్‌లో అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఈసారి ఫ్రాంచైజీలు ఏ ధ‌ర‌ను ఇస్తాయో చూడాలి.

ఈ ఆట‌గాడిని సొంతం చేసుకునేందుకు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ ప‌డుతున్నాయి. వీటి మ‌ధ్య పోటీ తీవ్ర‌త ఎక్కువైతే మ్యాక్స్‌వెల్‌కు మంచి ధ‌ర ల‌భించే అవ‌కాశ‌ముంది.

ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ మొయిన్ అలీకి కూడా ఈ వేలంలో మంచి ధ‌ర ల‌భించొచ్చు. ఈ ఆట‌గాడిని కూడా చెన్నై జ‌ట్టు సొంతం చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది.

వేలంలో పాల్గొనే మొత్తం ఆట‌గాళ్లు: 292 మంది

  • భారత్ ఆట‌గాళ్ల సంఖ్య‌: 164
  • విదేశీ క్రికెటర్లు: 125
  • అసోసియేట్‌ దేశాల నుంచి: 3
  • జట్లలో ఖాళీ స్థానాలు: 61
  • విదేశీ ఆటగాళ్ల సంఖ్య‌: 22