భ‌ర్త‌తో షికారు కెళ్ళిన స‌మంత‌

298
samantha is now in miami with hubby

కొన్నాళ్ళు ప్రేమ ప‌క్షులుగా విహ‌రించిన స‌మంత‌, నాగ చైత‌న్య జంట గ‌త ఏడాది మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ప్ర‌స్తుతం త‌మ లైఫ్‌ని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన స‌మంత‌, చైతూలు ప్ర‌స్తుతం కాస్త బ్రేక్ తీసుకొని విదేశాల‌లో విహ‌రిస్తున్నారు. మార్చి 19న స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసి అమెరికాలోని మియామీ విహార‌యాత్రకి బ‌య‌లుదేరుతున్నామ‌నే హింట్ ఇచ్చింది. 

తాజాగా విన్‌వుడ్‌లో దిగిన ఫోటోని షేర్ చేసి అభిమానుల‌కి మాంచి కిక్ ఇచ్చింది. వాల్ పోస్ట‌ర్ ద‌గ్గ‌ర త‌న భ‌ర్త‌ని చూస్తూ దిగిన ఫోటో అభిమానుల‌కి తెగ న‌చ్చేసింది. విన్‌వుడ్ వాల్స్‌లో ఉత్త‌మ‌మైన క‌ళాకారుల చిత్రాల‌ని ప్ర‌ద‌ర్శించ‌నుండ‌గా, వాటిని చూసి ఈ జంట మురిసిపోయిన‌ట్టు తెలుస్తుంది. స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రం మార్చి 30న విడుద‌ల కానుండ‌గా, మ‌హాన‌టి మూవీ మే 9న రిలీజ్ కానుంది. ప‌లు త‌మిళ చిత్రాలు కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇక చైతూ ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి అనే ప్రాజెక్ట్‌తో పాటు శైల‌జా రెడ్డి అల్లుడు చేస్తున్నాడు. వీటి త‌ర్వాత స‌మంత‌తో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు నాగ చైత‌న్య‌.