లిప్‌స్టిక్ బాబా – ఓన్లీ ఫర్ బాయ్స్ బాబా

639
godman-lipstick-baba-arrested-in-rajasthan

ఓ ఆరు నెలల కింద సంచలనం సృష్టించిన డేరా బాబా రాసలీలల గురించి చదివాం కదా. తన ఆశ్రమంలో ఉన్న మహిళలను బెదిరించి వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్న కథలు కోకొల్లలుగా విన్నాం. అయితే.. దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఇప్పుడు మనం చదవబోయే బాబా హిస్టరీ. మరీ.. అంత వరస్ట్‌గా ఉంటుందా ఆ బాబా స్టోరీ అంటే.. నేనేం చెప్పను.. మీరే చదవండి…



యువ‌కుల‌తోనే శృంగారం

ఆయన అసలు పేరు కుల్‌దీప్ సింగ్ ఝాలా. ఊరు రాజస్థాన్. ముద్దు పేర్లు మాత్రం బోలెడు. ఎక్కువగా పిలిచేది మాత్రం లిప్‌స్టిక్ బాబా అని. వామ్మో.. అదేం పేరురా బాబు అని అలా పగలబడి నవ్వకండి. దానికి ఓ కారణం ఉంది. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. మనలాంటి వ్యక్తి అస్సలే కాదు. సాక్షాత్తూ దైవ సంభూతులు. అని ఆయనే చెప్పుకుంటాడు. శక్తి, జగదాంబ పునర్జన్మనని చెప్పుకుంటాడు. అంతే కాదు.. దేవీ నవరాత్రుల సమయంలో అచ్చం మహిళలాగా తయారై.. పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుంటాడు. అందుకే ఆ బాబాకు లిప్‌స్టిక్ బాబా అని ముద్దుపేరు. జగదాంబా బాబా అని పిలిచినా అక్కడ తెలియని వారుండరు. ఆయనకు ఓ 700 మంది దాకా ఫాలోవర్స్ ఉంటారట. ఈ బాబా కూడా సేమ్ టూ సేమ్ డేరా బాబా లాగానే రాసలీలలు చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. రాసలీలలంటే మహిళలతో అని అనుకునేరు. సేమ్ టూ సేమ్ డేరా బాబా లాగానే కాని.. మహిళలతో కాదు.. యువకులతో, పురుషులతో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

అంతే కాదు.. తన పురుష ఫాలోవర్స్‌తో శృంగారం చేసిన అనంతరం వాళ్లను టార్చర్ పెట్టడం.. ఆత్మహత్యకు పురిగొల్పడం ఇదే లిప్‌స్టిక్ బాబా అసలు రూపం. తనకు పాలోవర్‌గా ఉన్న ఓ 20 ఏండ్ల యువకుడిని ఇలాగే ప్రలోభ పెట్టి.. అత్యాచారం చేసి అతడిని టార్చర్ పెట్టి.. ఆత్మహత్యకు పురిగొల్పినట్టు ఆరోపణలు రావడంతో ఝాలావర్ పోలీసులు లిప్‌స్టిక్ బాబాను అరెస్ట్ చేశారు. దీంతో ఆ బాబా అసలు బాగోతమంతా బయటపడింది.


యువరాజ్ సింగ్ అనే యువకుడు ఫిబ్రవరిలో సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ ఓ అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడంటూ టార్చర్ పెట్టడంతోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడని సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లిప్‌స్టిక్ బాబా భారిన పడిన మరో ఏడుగురు ఫాలోవర్లు అతడి బాగోతాలను పోలీసులకు వివరించారు. తమను శృంగారంలో పాల్గొనాలని లిప్‌స్టిక్ బాబా ఒత్తిడి తెచ్చేవాడని, శృంగారం తర్వాత టార్చర్ పెట్టేవాడని బాధితులు పోలీసుల ముందు వాపోయారు.