అభిమాని కోసం మోకాళ్లపై కూర్చున్న డార్లింగ్

939
prabhas-sit-knees-physically-disabled-fan

బాహుబలి ఫ్రాంచైజీలతో ఎనలేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేందుకు ప్రభాస్ చేసిన ఈ పనే నిదర్శనం. ఇటీవల అభిమానులతో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఓ దివ్యాంగ అభిమానితో ప్రభాస్ ఓ సెల్ఫీ తీసుకున్నాడు. 

మామూలుగా అయితే పెద్ద విషయమేమీ కాకపోయినప్పటికీ.. ఆ దివ్యాంగ అభిమానికి అనుకూలంగా, అనువుగా ఉండేలా మోకాళ్ల మీద కూర్చుని ప్రభాస్ ఆ సెల్ఫీ ఇచ్చాడు. ఆ సెల్ఫీ తీసుకునేటప్పుడు పక్కనే ఉన్న కొందరు అభిమానులు ఆ ఫొటోలను క్లిక్‌మనిపించి నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యామల్లో వైరల్‌గా మారాయి.

మనసున్నోడు అంటూ నెటిజన్లు ప్రభాస్ ఔదార్యానికి కామెంట్లు పెడుతున్నారు. అంతేనా బాలీవుడ్ ప్రముఖులూ ప్రభాస్ హుందాతనానికి ఫిదా అయ్యారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.