
జీవీకే-ఈఎంఆర్‌ఐ హైదరాబాద్ కాల్ సెంటర్‌లో ఉద్యోగ నియమకాలకు ఈ నెల 31వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రొగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ తెలిపారు. ఫుల్‌టైం డిగ్రీ కోర్సు పూర్తిచేసిన 20 -28 ఏండ్ల మధ్య వయస్కులైన పురుష -స్త్రీ అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్వ హించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. మంచి శరీరధారుడ్యం కలిగి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చదవడం, రాయడంలో ప్రావీణ్యత గల వారిని ఎంపికచేస్తామన్నారు. ఇంటర్వ్యూలను కింగ్‌కోఠిలో గల జిల్లా దవాఖాన ప్రాంగణంలోని జీవీకే-ఈఎంఆర్‌ఐ 108 ఆఫీస్‌లో నిర్వహించనున్నామ న్నారు. వివరాల కోసం 91007 98730, 91007 992 55, 78938 50066 నెంబర్లల్లో సంప్రదించాలన్నారు.